Tuesday, April 22, 2014

Manam


                                మనం 

ఈ కవిత మన దేశ ప్రజల మానసిక పరిస్థితి మీద రాసినధి. ప్రతి మొదటి వాక్యం ఒక నాటి భారతం లోని  వారి గురించి, మనకి స్వాతంత్ర్యం తెచ్చి పెట్టిన వారి గురించి అయితే ప్రతి రెండో వాక్యం ఈ నాటి వారి గురించి.


పరతంత్రపు శృంఖలాలు తెంచుకున్న వీరులం
మహామహులు రగిలించిన చైతన్యపు వారసులం


స్వాతంత్రపు విజయాలను పంచుకున్న పౌరులం
డెమోక్రసీ నీడలోన రాచరికపు బానిసలం


కలం గళం పదం బలం నమ్ముకున్న యోధులం
ధనం  మదం దౌర్జన్యం మెచ్చుకునే భీరులం


ఏక మతం మానవతం నినదించిన నేతలం
జాతి కులం నాయకులకు ముఖ్యమనే మూఢులం


దేశ మాత సేవలోన త్యాగ భావ యోగులం
నోటు ముందు వోటు తలను వంచుతున్న హీనులం


విద్య  లేని కాలమందు విచక్షణా జ్ఞ్యానులం
సాటిమేటి విద్యలున్న నేటి వింత మూర్ఖులం


                                                                                                  - రసిఖ