ఇడియట్
ఇడియట్ సినిమా ఒచ్చినప్పుడు అందులో "చెలియా చెలియా" అనే పాట ట్యూన్ కి రాసుకున్నా ఇది. Situation మాత్రం అదే.
పల్లవి:
ప్రేమా వలపే నిలుపు.. కవివై కథలే నడుపు..... కథలో వ్యథలే గెలుపు...
ప్రేమా మనసే మొదలు... బ్రతుకే బరువై మిగులు.. రగిలే చితులే తుదలు...
మనసారా మనసే అడిగే ఈ వేదన .. ప్రియమారా పెదవే పలికే ఈ రోదన ..
అడుగే పిడుగై కదిలే పయనం ఆపుమా.....
చరణం 1 :
వెదికే వెలుగే కరువై శూన్యం నరకం మిగిలే
యదలో సమరం జరిగే మరణం బ్రతుకై మిగిలే
రెప్పలు తెరచిన మెలకువలో కలలన్నీ కరిగెను కన్నీరై
నీరే ఇంకదు కన్నులలో నీ నెత్తుటి రాతలు గుండెలలో
చరితలు చెప్పిన సత్యమిదే
ప్రేమల రాతలు మారవులే
ప్రేమా ప్రేమే పంచకుమా... విధికే వరమీ వలపు సుమా.....ఓ ఓ ఓ
మనిషిని వదిలి మనసుని చంపే గరళం ఈ ప్రేమా
చెలియా చెలియా వినవా కలతే కోతే నెలవై... హృదయం రగిలే పగిలే
సఖియా వలపే పంచి... జతగా నడిచి విడిచి... వదిలే క్షణమే మిగిలే..
చరణం 2 :
గతేమే కథగా మారి భవితే కలగా మారి
వలపే వరమై చేరి వరమే విషమై మారి
నేనే నీవై మారానే నీ ఊసే ఆశై సాగానే
నువ్వే లేని నేనుంటే ఆ నేనుకి అర్ధం మరిచానే
ప్రాణం పోసిన దేవతవి
మనసే బలిగా కోరకుమా
ప్రేమా ప్రేమే పంచకుమా... విధికే వరమీ వలపు సుమా.....ఓ ఓ ఓ
కలసిన మనసులు విడిపోలేవు జన్మలు ఎన్నైనా
చెలియా చెలియా వినవా కలతే కోతే నెలవై... హృదయం రగిలే పగిలే
ప్రియురాల యదలో నీ ఆలాపన.. విడిపోదే మౌనం నన్ను కమ్మేసినా..
అలవో కలవో నడిచే శిలవో... ప్రియతమా.....
